తెలంగాణలో కరోనా కేసులు 24 గంటల్లో 857, GHMC లో 250

COVID 19 in Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. వేయి కంటే తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 857 కేసులు నమోదయ్యాయని, నలుగురు మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 51 వేల 188కు చేరుకుంది.
24 గంటల్లో 1, 504 మంది కోలుకున్నారని దీంతో కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 30 వేల 568కు చేరుకుంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 19 వేల 239 ఉండగా, గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 16 వేల 499గా ఉంది.
https://10tv.in/covid-19-positive-cases-increased-in-telangana-again/
జిల్లాల వారీగా కేసులు : –
ఆదిలాబాద్ 09. భద్రాద్రి కొత్తగూడెం 35. జీహెచ్ఎంసీ 250. జగిత్యాల 27. జనగామ 10. జయశంకర్ భూపాలపల్లి 1. జోగులాంబ గద్వాల 2. కామారెడ్డి 01. కరీంనగర్ 48. ఖమ్మం 25. కొమరం భీం ఆసిఫాబాద్ 02. మహబూబ్ నగర్ 14.
మహబూబాబాద్ 16. మంచిర్యాల 20. మెదక్ 16. మేడ్చల్ మల్కాజ్ గిరి 61. ములుగు 1. నాగర్ కర్నూలు 17. నల్గొండ 30. నారాయణపేట 1. నిర్మల్ 06. నిజామాబాద్ 0. పెద్దపల్లి 17. రాజన్న సిరిసిల్ల 15. రంగారెడ్డి 88. సంగారెడ్డి 36. సిద్దిపేట 25. సూర్యాపేట 18. వికారాబాద్ 03. వనపర్తి 8. వరంగల్ రూరల్ 12. వరంగల్ అర్బన్ 38. యాదాద్రి భువనగిరి 5. మొత్తం : 857.