Malla Reddy : దమ్ముంటే.. రాజీనామా చేయ్.. రేవంత్ రెడ్డికి మంత్రి సవాల్

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ పై ఫైర్ అవుతున్న

Malla Reddy : దమ్ముంటే.. రాజీనామా చేయ్.. రేవంత్ రెడ్డికి మంత్రి సవాల్

Malla Reddy

Updated On : August 25, 2021 / 7:29 PM IST

Malla Reddy Challenges Revanth Reddy : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు. మంత్రులు, టీఆర్ఎస్ నేతలు సైతం అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో అని మల్లారెడ్డి అన్నారు.

మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయని వెల్లడించారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని.. అందులో అసైన్డ్‌, చెరువులకు సంబంధించినది, కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని వివరించారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు.

రేవంత్ రెడ్డి చీడ పురుగు అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కొడంగల్ ను అభివృద్ది చేశావా అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. రేవంత్ ఓ దొంగ అని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తాను పాలు అమ్మినా ఎప్పుడూ దందా చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కూడా బ్రోకర్ పని చేసి తెచ్చుకున్నారని విమర్శించారు. అప్పుడే సీఎం అయినట్లు రేవంత్ అనుకుంటున్నారని మండిపడ్డారు. ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో ఉన్నా తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.

‘‘ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్‌ సవాల్‌ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తాను. మంత్రి పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. రేవంత్‌ పీసీసీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో’’ అని రేవంత్‌ రెడ్డికి మల్లారెడ్డి సవాల్‌ విసిరారు. రేవంత్ సినిమాలో కూడా సీఎం కాలేడని మంత్రి మల్లారెడ్డి అన్నారు.