ప్రతి రైతుకు ఒక భూధార్ నెంబర్ ఇస్తాం.. అలాంటి వారితోనే భూములను సర్వే చేయిస్తాం.. మంత్రి పొంగులేటి

ప్రతి రెవెన్యూ విలేజ్‌లో మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. ఏ కార్యాలయం చుట్టూ రైతులు తిరగకుండా చేస్తున్నాం.

ప్రతి రైతుకు ఒక భూధార్ నెంబర్ ఇస్తాం.. అలాంటి వారితోనే భూములను సర్వే చేయిస్తాం.. మంత్రి పొంగులేటి

Ponguleti Srinivasa Redd

Updated On : June 3, 2025 / 1:15 PM IST

Ponguleti Srinivasa Reddy: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా మంగళవారం నుంచి రాష్ట్రమంతటా రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఖమ్మంలో జరిగిన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు.

Also Read: రైతులకు గుడ్‌న్యూస్.. ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయ్.. బ్యాంక్ అకౌంట్లలో ఎప్పుడు జమ అవుతాయంటే..?

ప్రభుత్వం అనుకున్నది ప్రజల మీద రుద్దే మనస్వత్వం మా ప్రభుత్వానిది కాదు. దేశ వ్యాప్తంగా తిరిగి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఒక చట్టం అమలు పరిచేటప్పుడు ముందుగా దాని విశ్లేషణ కోసం నాలుగు మండలాలు పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నాం. ఈరోజు నుంచి ప్రతి రెవెన్యూ విలేజ్‌లో మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. ఏ కార్యాలయం చుట్టూ రైతులు తిరగకుండా చేస్తున్నాం. ఈ చట్టం మీ చట్టం మాదిరిగా పనిచేస్తుంది. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన విధంగానే వచ్చే ఆగస్టు నాటికి ధరణి నుంచి విముక్తి కల్పిస్తాం. మీ సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

 

రాష్ట్రంలో 413 రెవెన్యూ గ్రామాల్లో నక్షాలు లేవు. అయిదు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టులు ఐదు సంస్థలకు ఇచ్చాం. గత ప్రభుత్వంలో మాదిరిగా ఒక్కరికే ఇవ్వలేదు. ములుగుమాడుకు ఒక్క నక్షా తయారు చేసి ఇస్తాం. ఆ నాటి ప్రభుత్వం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేకుండా ఉన్నట్లుగా చిత్రీకరించారు. రైతు బంధు కోసం పెద్దల సహకారంతో అక్రమాలు చేశారు. ధరణి పేరుతో అక్రమంగా ఆనాడు ఇందిరమ్మ పేరుతో పేదలకు ఇచ్చిన భూములను తారుమారు చేశారని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆధార్ లాగే ప్రతి రైతుకు ఒక భూధార్ నెంబర్ ఇస్తాం. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించి భూములను సర్వే చేయిస్తాం. ప్రతి రెవెన్యూ విలేజ్ కు ఒక వీఆర్ఓను ఇస్తాం. ఇందుకోసం 3,556 మంది రెవెన్యూ అధికారులను నియమిస్తున్నాం. రెవెన్యూ అధికారి కాపలాదారుడుగా ఉంటారని మంత్రి పొంగులేటి చెప్పారు.
రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా మార్పులు చేస్తున్నాం. స్లాట్ బుకింగ్ పెట్టి పారదర్శకంగా చేస్తున్నాం. గత ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ కొత్త పథకాలు ఇస్తున్నామని పొంగులేటి చెప్పారు.

Also Read: రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. మీరు ఈ పని చేయకపోతే మీ రేషన్ కార్డు కట్..! కేంద్రం స్ట్రిక్ట్ ఆర్డర్స్..