Kavitha: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్..
ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదన్నారు.

Kavitha: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందని కవిత ఆరోపించారు. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు కవిత. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదన్నారు. ఈ మేరకు ఎక్స్ పోస్ట్ పెట్టారు కవిత.
మరోవైపు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సైతం సీరియస్ అయ్యారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. ప్రతీకార రాజకీయాలు అభద్రతకు స్పష్టమైన సంకేతమని హరీశ్ అన్నారు. కల్పిత కేసులు కోర్టులో నిలబడవు లేదా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవు అని తేల్చి చెప్పారు. మేము కేటీఆర్ తో నిలబడతాము.. సత్యం గెలుస్తుంది.. సత్యమేవ జయతే! అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు హరీశ్ రావు.
Also Read: ఎమ్మెల్సీ కవితతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టిన బీఆర్ఎస్..
తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మళ్లీ కలకలం రేగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఈ కేసులో ఏసీబీ మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు కేటీఆర్ ఎక్స్ లో తెలిపారు. అయితే, ముందుగానే నిర్ణయించబడ్డ పలు కార్యక్రమాల నిమిత్తం లండన్, అమెరికా వెళ్లాల్సి ఉందన్న కేటీఆర్.. ఈ నెల 28న విచారణకు హాజరు కాలేనని, తనకు మరి కొంత సమయం కావాలని ఏసీబీని కోరారు. విదేశాల నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతానని ఏసీబీ అధికారులకు రాసిన లేఖలో వెల్లడించారు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 26, 2025