Nagam Janardhan Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చేసిన నాగం జనార్దన్‌రెడ్డి

పార్టీలో ఉండి ఉద్యమం చేయకూడదా? అని అన్నారు. కొల్లాపూర్ లో జగదీశ్వర్ రావు పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. అయితే,

Nagam Janardhan Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చేసిన నాగం జనార్దన్‌రెడ్డి

Nagam Janardhan Reddy

Nagam Janardhan Reddy : కాంగ్రెస్‌ (Congress) అధిష్ఠానంపై మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారని, నాగర్‌కర్నూల్‌ టికెట్‌ విషయంలో ఆయన నిరసన ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై నాగం జనార్దన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ (Hyderabad) లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని నాగం స్పష్టం చేశారు. పార్టీలో ఉండి ఉద్యమం చేయకూడదా? అని అన్నారు. కొల్లాపూర్ లో జగదీశ్వర్ రావు పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. ఇప్పుడు పార్టీలో చేరిన ఆయనకు కొల్లాపూర్, నాగర్ కర్నూల్, గద్వాల సీట్లు కావాలట అని అన్నారు. నాగర్ కర్నూల్ నుంచి పోటీ ఎవరు చేస్తారన్న విషయం పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.

తాను నాగర్ కర్నూల్ లో పార్టీని కాపాడుకున్నానని అన్నారు. 5 సంవత్సరాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో తానే ఖర్చులు పెట్టుకుని పనిచేశానని తెలిపారు. పార్లమెంట్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు అన్నింటినీ తానే దగ్గరుండి చూసుకున్నానని చెప్పారు. తానే ఇక్కడ పార్టీని నడిపిస్తున్నానని అన్నారు. తానే రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నని, అనుభవం ఉన్న వ్యక్తినని చెప్పారు. సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు.

కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టాల్సిందని అన్నారు. కాళేశ్వరంలో భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ అని చెప్పారు. రూ.48 వేల కోట్లు తినేశారని ఆరోపించారు. వేల కోట్లు లూటి చేస్తున్నారని అన్నారు. 40 శాతం అవినీతి ఉందని కర్ణాటకలో ప్రచారం చేశామని, తెలంగాణలో 70 శాతం అవినీతి జరిగిందని అన్నారు. దీనిపై పీసీసీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.

YS Sharmila: కోకాపేటలో దొర గారి భారతీయ భవన్ కోసం రూ.3.41 కోట్లకే 11 ఎకరాలు: షర్మిల