రూ.200 ఆశచూపి బాలికపై అత్యాచారం

రూ.200 ఆశచూపి బాలికపై అత్యాచారం

Updated On : February 14, 2021 / 9:56 AM IST

person raped on Girl : మేడ్చల్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు వయసున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నగదు ఆశచూపి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం మరాఠా బస్తీలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ కు చెందిన కుటుంబం పది సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చారు. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి 13 ఏళ్ల కూతురు ఉంది. ఆన్ లైన్ క్లాసుల కారణంగా ఇంట్లోనే ఉంటోంది.

ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో నివాసముంటున్న అక్షయ్ లాల్ (39) అనే వ్యక్తి వారి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు. అయితే శుక్రవారం తల్లిదండ్రులు కూలీపనులకు వెళ్లగా, బాలిక ఒక్కత్తే ఇంట్లో ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బాలికకు రూ.200 ఇచ్చి తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అక్షయ్ లాల్ అత్యాచారం చేశాడు.

జరిగిన విషయాన్ని బాలిక.. తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు.