PM Narendra Modi : నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇలా ..
ప్రధాని మోదీ ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ..

PM Narendra Modi Nagar Kurnool Tour
PM Narendra Modi Nagar Kurnool Tour : ప్రధాని మోదీ ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా జిల్లాలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోదీ.. మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భారీ రోడ్డుషోలో పాల్గొన్నారు. రాత్రి వరకు ఈరోడ్డు షో కొనసాగింది. అనంతరం రాజ్ భవన్ కు చేరుకొని మోదీ అక్కడే బస చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ బయలుదేరి నాగర్ కర్నూల్ కు మోదీ చేరుకుంటారు. అక్కడ వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభలో కృష్ణా క్లస్టర్ పరిధిలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ లోక్ సభ స్థానాల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థులతోపాటు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోనున్నారు.
Also Read : MLC Kavitha Arrest : రాత్రంతా ఈడీ ప్రధాన కార్యాలయంలోనే ఎమ్మెల్సీ కవిత.. ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ
మోదీ తొలిసారి నాగర్ కర్నూల్ కు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లాకు ప్రధాని రానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు ఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షణ చేస్తున్నారు. వీరితో పాటు ముగ్గురు అదనపు ఎస్పీలు, 11 మంది డిఎస్పీలు, 28 మంది సీఐలతో పాటు 620 మంది పోలీసు సిబ్బంది బందోస్తుల నిర్వహించనున్నారు.
Also Read : PM Modi Road Show : మల్కాజిగిరిలో ప్రధాని రోడ్‌షో.. ఓపెన్ టాప్ వాహనం ఎక్కిన మోదీ!
- మోదీ పర్యటన ఇలా..
ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ నుంచి బయలుదేరుతారు.
10.55 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
11గంటలకు ప్రత్యేక విమానంలో నాగర్ కర్నూల్ కు బయలుదేతారు.
11.45 గంటలకు బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 12గంటలకు నుంచి 12.50 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
12.55 వరకు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 1గంటకు నాగర్ కర్నూల్ నుంచి కర్ణాటక రాష్ట్రం కలబురిగి బయలుదేరుతారు.