Wear Mask: మాస్క్ విలువ ఇదే.. ఒక్క ఫోటోతో పోలీసోళ్లు క్లారిటీ ఇచ్చేశారు..

Police Awareness Photo On Wearing Mask
Wear Mask: కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా విస్తరిస్తోంది. దేశంలోనూ.. తెలుగు రాష్ట్రాల్లోనూ సెకండ్ వేవ్ కొనసాగుతోండగా.. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అంటున్నారు. ఈక్రమంలోనే లేటెస్ట్‌గా ఓ పోలీస్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
SHO KACHIGUDA వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. వారు వేసిన ట్వీట్‌లో మాస్క్ కింద.. రూ. 10, తర్వాత పోలీసుల లోగో కింద.. రూ. 1000 తర్వాత హాస్పిటల్ వెంటిలేటర్ కింద రూ. లక్ష అని ఉంది.. అంటే పది రూపాయల మాస్క్ పెట్టుకోకపోతే.. పోలీసులు రూ. వెయ్యి ఫైన్ వేస్తారని, మాస్క్ లేకపోవడం వల్ల కరోనా వచ్చి హాస్పిటల్‌లో చేరితే, లక్షల్లో ఖర్చు అవుతుంది అన్నట్లుగా ఇంట్రస్టింగ్‌గా అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
— SHO KACHIGUDA (@shokachiguda) April 20, 2021
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ ప్రభావం గట్టిగా ఉందని, సాధారణ మాస్క్ వైరస్‌ను నివారించలేదని, N95, KN95 మాస్కులు మాత్రమే వైరస్ సోకకుండా అడ్డుకోగలవని అంటున్నారు నిపుణులు. ఒక్క మాస్క్‌ను రోజుల తరబడి ఉపయోగిస్తే.. ఎలాంటి ఉపయోగం ఉండదని, రోజు విడిచి రోజు మాస్క్ కచ్చితంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.

Masko
ప్రతి ఒక్కరూ N95, KN95 మాస్కులు రెండు ఉపయోగించాలని డాక్టర్లు చెబుతున్నారు. గుడ్డ మాస్క్‌లతో ప్రయోజనం లేదని అభిప్రాయపడుతున్నారు. 24 గంటల పాటు ఒక N95 మాస్క్ ఉపయోగించిన తర్వాత…దాన్ని ఓ కవర్‌లో భద్రపరచాలని సూచించారు. రెండోరోజు రెండో మాస్కు పెట్టుకోవాలని తెలిపారు. మరుసటి రోజు..మొదటి మాస్క్‌ను ధరించాలని, ఇలా రోజు విడిచి రోజు N95, KN95 మాస్కులు మార్చి, మార్చి ఉపయోగించాలని వైద్యులు వివరించారు. ఈ మాస్కులను ఇలా ఎన్నిరోజులైనా పెట్టుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు.