Bandi Sanjay: అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌.. ప్రజాగళం వినిపిస్తారు -బండి సంజయ్‌

ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కోరారు.

Bandi Sanjay: అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌.. ప్రజాగళం వినిపిస్తారు -బండి సంజయ్‌

Bandi Sanjay

Updated On : October 3, 2021 / 4:42 PM IST

Bandi Sanjay: ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కోరారు. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కరెన్సీని గెలిపిస్తారా? బీజేపీ కాషాయం జెండాను గేలిపిస్తారా? అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. ఈటల రాజేందర్ ఉద్యమ కారుడు, మంచి నాయకుడని కొనియాడారు.

ఈటల రాజేందర్ ఉద్యమ స్ఫూర్తిని హుజూరాబాద్‌లో నింపారని, హుజూరాబాద్ ప్రజలు చైతన్యం కలిగినవారని అన్నారు సంజయ్. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్న నేత ఈటల రాజేందర్ అని అన్నారు. ఈటల రాజేందర్ కల్మషం లేని బోలామనిషియని, రాజేందర్‌కు వాడుకుని అన్యాయం చేసినవారికి పాపం తగులుతుందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ చేసిందేమీ లేదని, దొంగ దీక్షేనని ఎద్దేవా చేసిన బండి సంజయ్.. హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే కేసీఆర్‌ పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా కూడా బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం సాధించి తీరుతారని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈటల రాజేందర్ విజయం సాధించడం ఖాయమని అసెంబ్లీలో అడుగు పెడుతారని అన్నారు.

హుజూరాబాద్‌లో రాజేందర్ గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ ప్రజాగళం వినిపిస్తారని చెప్పారు బండి సంజయ్. రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్‌లు ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడుతారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో రఘునందన్ రావు, రాజాసింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.