రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 03:20 PM IST
రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల

Updated On : March 6, 2020 / 3:20 PM IST

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఇప్పటికే రూ.1350.61 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం విడుదలైన నిధులతో కలిపి 2019-20లో రైతు బంధు పథకానికి రూ.1,683 కోట్లు విడుదల చేసింది.

2019-20 బడ్జెట్‌ కేటాయింపు మేరకు ఈ నిధులు కేటాయింపు జరిపినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రభుత్వం తక్షణం నిధులు విడుదలకు ఆదేశించడం విశేషం. 

రైతుకు పంట పెట్టుబడి సహాయం అందించే రైతు బంధు పథకం ద్వారా ప్రభుత్వం  రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి ఖరీఫ్, రబీ సీజన్ లో ఒక్కో ఎకరానికి రూ.5వేల చొప్పున మొత్తం 10 వేల రూపాయలు అందజేస్తోంది.