సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలనం.. నానమ్మ కళ్లలో ఆనందం కోసం.. చంపేసి కారులో తీసుకెళ్లి చూపించారట..
సూర్యాపేట పరువు హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నానమ్మ కళ్లలో ఆనందంకోసం ..

Suryapet: సూర్యాపేట పరువు హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణ హత్యకు కులాంతర వివాహం కారణమని పోలీసులు గుర్తించారు. ఆర్నెళ్ల క్రితం స్నేహితుడు కోట్ల నవీన్ చెల్లి భార్గవిని కృష్ణ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. అప్పటి నుంచి భార్గవి సోదరులు కృష్ణను అంతమొందించాలని భావించారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ప్రణాళిక వేసుకున్నారు. తాళ్లగడ్డకు చెందిన బైరు మహేశ్ తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడి సహాయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కృష్ణ తో మహేశ్ స్నేహం చేస్తున్నట్లు నటించాడు. ఆదివారం రాత్రి అదునుచూసి కృష్ణను హత్య చేశారు. ఆ రాతంత్రా మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని తిరిగినట్లు తెలిసింది. తెల్లవారుజాము సమయంలో కృష్ణ మృతదేహాన్ని పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాల్వకట్టపై పడేసి పరారయ్యారు.
Also Read: బాబోయ్.. మీ పిల్లలు కూడా గూగుల్‌లో వాటికోసం సెర్చ్ చేస్తున్నారా.. ఈ 17ఏళ్ల బాలిక ఏం చేసిందో తెలుసా?
నానమ్మ కళ్లలో ఆనందంకోసం..
కృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోట్ల నవీన్ నానమ్మ బుచ్చమ్మ మొదటి నుంచి మనుమరాలు వివాహాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. భార్గవిని పెళ్లిచేసుకున్న కృష్ణను హత్యచేయాలని తన కుమారుడు, మనుమళ్లను ఆమె రెచ్చగొడుతూ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మనుమళ్లను పదేపదే రెచ్చగొట్టడం ద్వారా వారు కృష్ణను చంపేందుకు పరోక్షంగా ఆమె కారణమైంది. అయితే, కృష్ణను హత్యచేసిన సమయంలో బుచ్చమ్మ ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేటలో బంధువుల ఇంటి వద్ద ఉంది. దీంతో కృష్ణ మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొనివెళ్లి బుచ్చమ్మకు చూపించారు. దీంతో ఆమెను సంతృప్తి పర్చారు. అదేవిధంగా నల్గొండలో ఉన్న నవీన్ మిత్రుడికి మృతదేహాన్ని చూపేందుకు వెళ్లారు. ఇలా రాత్రంతా నిందితులు కృష్ణ మృతదేహంతో కారులో షికారు చేశారు.
Also Read: అక్రమ సంతానమైనా సరే.. వివాహేతర సంబంధం వివాదంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఆరుగురు నిందితులు..
ఈనెల 19వ తేదీనే కృష్ణను హత్యచేయాలని నిందితులు భావించారు. ఆరోజు కుదరకపోవటంతో గత ఆదివారం హత్యచేశారు. కృష్ణ మృతదేహాన్ని బుచ్చమ్మకు చూపించిన తరువాత.. మృతదేహాన్ని చాలా దూరంలో పారేయాలని నిందితులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనగామ రహదారి నుంచి పిల్లల మర్రి వెళ్లే మూసీ కాలువ వద్ద పడేశారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.