TRS : టీఆర్ఎస్‌‌కు సోషల్ మీడియా టెన్షన్

గత రెండు రోజులుగా గులాబీ పార్టీ నేతలు మీడియా సమావేశాల్లో సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

TRS : టీఆర్ఎస్‌‌కు సోషల్ మీడియా టెన్షన్

Social Media

Updated On : December 16, 2021 / 8:53 AM IST

Social Media TRS : టీఆర్‌ఎస్‌కు సోషల్ మీడియా టెన్షన్ పట్టుకుంది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నామన్న ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించిందని అధికార పార్టీ నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతుండటంతో.. అన్ని రాజకీయ పార్టీలు అందుకు అనుగుణంగా కార్యకర్తలను సిద్ధం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుంటున్నాయి. ప్రత్యక్షంగా ప్రచారం చేసుకోలేని ఎన్నో అంశాలను ఈ వేదికల ద్వారానే ప్రజల్లోకి రాజకీయ పార్టీలు తీసుకెళ్తున్నాయి.

Read More : Today Gold Price : శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
సోషల్‌ మీడియా ప్రభావం ఎన్నికల ఫలితాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోందని.. రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాపై మరింత ఫోకస్ పెట్టింది అధికార పార్టీ. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు సహా ఇటీవల జరిగిన మండలి ఎన్నికల్లో కూడా సోషల్ మీడియాలో విపక్షాలు తెరపైకి తెస్తున్న అంశాలకు ధీటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నామన్న టెన్షన్ గులాబీ నేతలను వెంటాడుతుంది.

Read More : Amaravati Farmers : తిరుమలలో బహిరంగసభకు అమరావతి రైతులు రెడీ

దీనిపై.. గత రెండు రోజులుగా గులాబీ పార్టీ నేతలు మీడియా సమావేశాల్లో సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కీలక నేతలు సైతం మీడియా సమావేశాల్లో సోషల్ మీడియా పై వ్యాఖ్యలు చేస్తుండడంతో.. పార్టీ పరంగా సోషల్ మీడియా నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న వాదన తెరపైకి వస్తోంది.