టీ టీడీపీ కి మరో షాక్: టీఆర్ఎస్ లో చేరనున్న మహిళా నేత

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ కి మరో షాక్ తగిలేట్టు ఉంది. ఏపీలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు పార్టీ మారుతుంటే, తెలంగాణలో కూడా నాయకులు, పార్టీ మారే యోచనలో ఉన్నారు.తాజాగా యాదాద్రి జిల్లా కు చెందిన మహిళా నేత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి టీడీపీని వీడి త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానంతో టచ్ లో ఉన్నట్లు సమాచారం.
Read Also : కేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్‌లో చేరా : నామా
నల్గోండ, భువనగిరి పార్లమెంట్ స్ధానాలను టీడీపీకి కేటాయించాలని, లోక్ సభ అభ్యర్ధులను రంగంలోకి దించితే గెలిపించి తీరతామని స్ధానిక నాయకులు చంద్రబాబు నాయుడు కు చెప్పినా పరిగణనలోకి తీసుకోక పోవటంతో పార్టీ అధిష్టానంపై కోపంతో ఉన్న పార్టీ శ్రేణులు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో కీలక నేత నామా నాగేశ్వర రావు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి గురువారం టీఆర్ఎస్ లో చేరారు.
Read Also : సమ్మర్ స్పెషల్ : సికింద్రాబాద్ కాకినాడల మధ్య 2 ప్రత్యేక రైళ్లు