మద్యం అమ్మకాలపై మద్రాసు హైకోర్టు ఆదేశాలు

తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. వేల సంఖ్యలో వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటువంటి సమయంలో మద్యం దుకాణాలు తెరుచుకోగా.. మద్యం అమ్మకాలు చేపట్టింది ప్రభుత్వం. అయితే వినియోగదారులు భౌతిక దూరం పాటించకపోవడం, పెద్ద ఎత్తున బారులు తీరడంతో రసాభాసగా మారిపోయింది.
ఈ విషయమై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ ఎత్తివేసేంత వరకు మద్యం దుకాణాలను మూసివేయాలంటూ పళనిస్వామి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హోం డెలివరీ మాత్రం చేసుకోవచ్చని జస్టిస్ వినీత్ కొఠారి, జస్టిస్ పుష్పా సత్యనారాయణలతో కూడిన ప్రత్యేక డివిజన్ బెంచ్ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
మే 7వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకోగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు లాయర్లు, సామాజిక కార్యకర్తలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు మద్యం అమ్మకాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలంటూ ఆదేశించింది.
Read More :
* బార్లు, రెస్టారెంట్లు ఓపెన్..కండీషన్ అప్లై
* మందుబాబులకు షాక్…మద్యం షాపులు క్లోజ్