Numaish : ఇంట్లోంచి బయటకు రావడానికే జనం భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా?: హైకోర్టు
ఎగ్జిబిషన్(నుమాయిష్) నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోగలదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ కొనసాగాలా? వద్దా? అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని..

Hyderabad Numaish
Hyderabad Numaish : నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 2019లో జరిగిన అగ్నిప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం ఎగ్జిబిషన్‌ను నిలిపివేయడం సమంజసం కాదని ఎగ్జిబిషన్ సొసైటీ కోర్టుకి తెలిపింది. థియేటర్లు, మాల్స్ కు లేని ఆంక్షలు ఎగ్జిబిషన్ కు ఎలా విధిస్తారని కోర్టు దృష్టికి తెచ్చింది. దీనిపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Dangerous Alexa: 10 ఏళ్ల చిన్నారిని కరెంటు ప్లగ్‌లో వేలు పెట్టమన్న “అలెక్సా”
ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకు రావడానికే జనం భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఎగ్జిబిషన్(నుమాయిష్) నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోగలదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ కొనసాగాలా? వద్దా? అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.
Fenugreek Seeds : చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువు తగ్గించే మెంతులు
కాగా.. పోలీసులు, ఫైర్, జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ వివరణతో 2019 అగ్నిప్రమాదంపై విచారణను హైకోర్టు ముగించింది. వివిధ విభాగాల అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.