TS Covid Up Date : తెలంగాణలో కొత్తగా 185 కోవిడ్ కేసులు
తెలంగాణలో ఈరోజు కొత్తగా 185 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 205 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

Ts Covid Update
TS Covid Up Date : తెలంగాణలో ఈరోజు కొత్తగా 185 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 205 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,79,430 కి చేరింది. వీరిలో 6,71,655 మంది కోలుకున్నారు. దీంతో, రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.85 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈ రోజు విడుదల చేసిన తాజా బులెటిన్ లో పేర్కొంది.
Also Read : Pfizer On Corona End : అప్పటివరకు కరోనా అంతం కాదు..! షాకింగ్ విషయం చెప్పిన ప్రముఖ ఫార్మా కంపెనీ
మరో వైపు, గడచిన 24 గంటల్లో కోవిడ్‌తో ఒకరు మరణించటంతో ఇప్పటి వరకు కోవిడ్, సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 4,014 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,761 క్రియాశీల కేసులు ఉన్నాయి ఇలా ఉండగా, GHMC పరిధిలో కొత్తగా 78 కోవిడ్ కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో15, రంగా రెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 14 మంది చొప్పున, హన్మకొండ జిల్లాలో 11 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది.
ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు
మరోవైపు రాష్ట్రంలో ఇవాళ ఒక్క రోజే 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20కి పెరిగింది. విదేశాల నుంచి వచ్చిన 10 మందికి పాజిటివ్‌గా తేలగా, రిస్క్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన మరో ఇద్దరికి పాజిటివ్ జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాల్లో గుర్తించారు. మరో వైపు దేశంలో శనివారం ఒకే రోజు 26 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో ఎనిమిది, కర్ణాటకలో ఆరు, కేరళలో నాలుగు కేసులు రికార్డయ్యాయి.