Grain Purchase : ధాన్యం సేకరణపై ఎటూ తేల్చని కేంద్రం

యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంపై స్పష్టత కోసం కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు.

Grain Purchase : ధాన్యం సేకరణపై ఎటూ తేల్చని కేంద్రం

Grain

Updated On : November 24, 2021 / 8:02 AM IST

Telangana ministers met Piyush Goyal : యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంపై స్పష్టత కోసం కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, కమలాకర్‌తో పాటు ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు.

తెలంగాణ నుంచి యాసంగి పంటలో ఎంత ధాన్యం, ఏ రూపంలో కొనుగోలు చేస్తారో తేల్చాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు సహా అందుబాటులో ఉన్న ధాన్యం రబీ పంట కొనుగోళ్ల అంశాలను కేంద్ర మంత్రికి తెలంగాణ మంత్రులు వివరించారు. మంత్రి కేటీఆర్ బృందం లేవనెత్తిన అంశాలపై 26న తమ నిర్ణయం చెబుతామని కేంద్రం పేర్కొంది.

CM KCR : గులాబీ బాస్ ఒత్తిడికి కేంద్రం దిగివస్తుందా?

దీంతో ఈ నెల 26న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. ధాన్యం కొనుగోలు పరిమితి స్వల్పంగా పెంచేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు.

సమావేశం అనంతరం పీయూష్ గోయల్‌తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను మంత్రుల బృందం కలిసింది. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని విషయాలపై సానుకూలంగా స్పందించారని.. కొన్నింటిపై ఎలాంటి స్పందన రాలేదని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు.