Telangana Covid Cases Report : తెలంగాణలో కొత్తగా 17 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 15వేల 675 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 17 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Covid Cases Report)

Telangana Covid Cases Report : తెలంగాణలో కొత్తగా 17 కరోనా కేసులు

Telangana Covid Report

Updated On : April 4, 2022 / 10:01 PM IST

Telangana Covid Cases Report : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 15వేల 675 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 17 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లో అత్యధికంగా 12 కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 3 కేసులు.. కరీంనగర్, నిర్మల్ జిల్లాలలో చెరో పాజిటివ్ కేసు గుర్తించారు. అదే సమయంలో మరో 36 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,345 మంది కరోనా బారినపడగా వారిలో 7,86,963 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 271 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 10వేల 348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12 కొత్త కేసులు నమోదయ్యాయి.(Telangana Covid Cases Report)

అటు దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. తాజాగా కొత్త కేసులు వెయ్యిలోపు నమోదుకావడం భారీ ఊరట కలిగిస్తోంది. ఇక కోవిడ్ మరణాలు 20 దిగువకు తగ్గిపోయాయి. ఆదివారం 3 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 913 మందికి కరోనా సోకినట్లు తేలింది. 715 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు క్షీణించాయి. ముందురోజు(1,096) కంటే 16 శాతం మేర కేసులు తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువనే ఉంది. ఇప్పటివరకూ 4.30 కోట్లకు పైగా కరోనా కేసులొచ్చాయి.

China Covid 4th Wave : చైనాలో కరోనా విజృంభణ.. 2ఏళ్ల రికార్డు బ్రేక్.. ఒక్కరోజే భారీగా కేసులు

24 గంటల వ్యవధిలో మరో 13 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజు ఆ సంఖ్య 81గా ఉంది. ఇప్పటివరకూ దేశంలో 5.21 లక్షల మంది కరోనాకు బలయ్యారు. నిన్న 1,316 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 12 వేలకు దిగొచ్చాయి. యాక్టివ్ కేసుల రేటు 0.03 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది.

వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న రెండు లక్షల మందికి పైగా టీకా తీసుకోగా.. మొత్తంగా 184 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుతుంటే.. చైనా, బ్రిటన్‌ వంటి పలు దేశాల్లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది.

చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో వైరస్‌ వ్యాప్తి విపరీతంగా ఉంది. దేశంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరంలోనే బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం.. షాంఘైలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. పరీక్షలను పెంచడంతో పాటు పెద్ద ఎత్తున ఆరోగ్య కార్యకర్తలు, సైన్యాన్ని నగరానికి పంపింది.

CHINA COVID CASES : చైనాను వదలని కరోనా.. ఒక్కరోజే 13వేల కేసులు నమోదు.. కొత్త వేరియంట్ తో కలకలం

చైనాలో కొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా 13వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. ఇందులో దాదాపు 9వేల కేసులు ఒక్క షాంఘైలోనే ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నగరంలో వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉండటంతో గతవారం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. నగర వ్యాప్తంగా దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేసి, కఠినమైన లాక్‌డౌన్‌ విధించి.. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసినప్పటికీ షాంఘైలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు సోమవారం నుంచి ట్విన్‌ కొవిడ్‌ పరీక్షలు మొదలుపెట్టారు. అంటే నగరంలో ప్రతి పౌరుడికి యాంటీజెన్, న్యూక్లిక్‌ యాసిడ్‌ పరీక్షలు చేస్తున్నారు.