Telangana Covid Cases Bulletin : తెలంగాణలో కొత్తగా 29 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో..

Telangana Covid Cases Bulletin : తెలంగాణలో కొత్తగా 29 కరోనా కేసులు

Telangana Covid Report

Updated On : April 7, 2022 / 8:56 PM IST

Telangana Covid Cases Bulletin : తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16వేల 388 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 29 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 17 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 32 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. నేటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు రాష్ట్రంలో 7,91,426 కరోనా కేసులు నమోదవగా.. 7,87,066 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 17,085 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 22 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Covid Cases Bulletin)

అటు దేశవ్యాప్తంగానూ కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. తాజాగా 4.8 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,033 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితంరోజు కంటే కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో మరో 43 మంది కోవిడ్ తో మరణించారు. యాక్టివ్ కేసులు 11వేల 632కి చేరాయి. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.03 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. ఈ రెండేళ్ల కాలంలో 4.3 కోట్ల మందికిపైగా కరోనా బారినపడగా.. 5.21 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 4.24 కోట్ల మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 15 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ పంపిణీ అయిన డోసుల సంఖ్య 185 కోట్ల మార్కు దాటింది.

China Warning: ”దంపతులు కలిసి పడుకోవద్దు.. ముద్దులు అస్సలు పెట్టుకోకూడదు”

కాగా, మరోసారి ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్‌లో కొత్త వేరియంట్ రకం XE కలవరపెడుతోంది. ముంబైలోనూ దీని ఆనవాలు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అది XE వేరియంట్ అని ఇప్పుడే చెప్పలేమంటూ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. భారత్‌లో ప్రారంభ రోజుల నాటికి వైరస్ వ్యాప్తి తగ్గుతున్న సమయంలో తాజా వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపనుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

ప్రపంపవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉధృతి తగ్గినప్పటికీ కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలో మ్యుటేషన్‌ కారణంగా కొత్తగా పుట్టుకొస్తున్న హైబ్రిడ్‌ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించింది. ఇప్పటివరకు XD, XE, XF అనే మూడు హైబ్రిడ్‌ రకాలను గుర్తించినట్లు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎక్స్‌ఈ స్ట్రెయిన్‌ (ఒమిక్రాన్‌ రెండు వేరియంట్ల ఉపరకమైన హైబ్రిడ్‌ స్ట్రెయిన్‌)లో 10శాతం పెరుగుదల రేటు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.

China Covid Cases Report : ఒక్కరోజే 16,400 కరోనా కేసులు.. చైనాలో మళ్లీ కొవిడ్ కల్లోలం.. లాక్‌డౌన్ విధించినా..