Telangana Covid : తెలంగాణలో 800 దాటిన కోవిడ్ కేసులు

రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 852 కొత్త   కోవిడ్   కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ ఈరోజు విడుదల   చేసిన బులెటిన్ లో పేర్కోంది.

Telangana Covid : తెలంగాణలో 800 దాటిన కోవిడ్ కేసులు

Covid 19

Updated On : July 27, 2022 / 9:18 PM IST

Telangana Covid :  రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 852 కొత్త   కోవిడ్   కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ ఈరోజు విడుదల   చేసిన బులెటిన్ లో పేర్కోంది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,16,531కి పెరిగింది. ఇందులో 8,07,505 మంది బాధితులు కోలుకున్నారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రాష్ట్రంలో 640 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,915 యాక్టివ్‌ కేసులున్నాయి.

కొత్త కేసులతో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 358, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 63, రంగారెడ్డిలో 57, పెద్దపల్లిలో 35, మహబూబాబాద్‌లో 32, ఖమ్మంలో 28, హన్మకొండలో 26, నల్గొండలో 26, జనగామలో 26, కరీంనగర్‌లో 24, భద్రాద్రి కొత్తగూడెంలో 22 కేసులు నమోదయ్యాయి.

Also Read : Gandipeta Pond : గండిపేట చెరువు 12 గేట్లు ఎత్తివేత..12 ఏళ్ల తర్వాత తొలిసారి