Gandipeta Pond : గండిపేట చెరువు 12 గేట్లు ఎత్తివేత..12 ఏళ్ల తర్వాత తొలిసారి

భారీ వర్షాలకు గండిపేట చెరువు (ఉస్మాన్‌సాగర్‌) నిండుకుండలా మారింది. భారీగా వరద నీరు చేరడంతో జలాశయం 12 గేట్లను అధికారులు ఎత్తారు. మంగళవారం రాత్రి 10 గంటలకు 12 గేట్లు ఎత్తి 7,308 క్యూసెక్కుల నీటిని జలమండలి అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి 6,800 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. దాదాపు 12 ఏండ్ల తర్వాత ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తడం విశేషం.

Gandipeta Pond : గండిపేట చెరువు 12 గేట్లు ఎత్తివేత..12 ఏళ్ల తర్వాత తొలిసారి

Gandipeta

Gandipeta pond : ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు గండిపేట చెరువు (ఉస్మాన్‌సాగర్‌) నిండుకుండలా మారింది. భారీగా వరద నీరు చేరడంతో జలాశయం 12 గేట్లను అధికారులు ఎత్తారు. మంగళవారం రాత్రి 10 గంటలకు 12 గేట్లు ఎత్తి 7,308 క్యూసెక్కుల నీటిని జలమండలి అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి 6,800 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. దాదాపు 12 ఏండ్ల తర్వాత ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తడం విశేషం. 2010లో కురిసిన భారీ వర్షాల కారణంగా అప్పట్లో 5 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. ఇప్పుడు 7,308 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గండిపేట చెరువు నీటి విడుదల కారణంగా మంచిరేవుల నుంచి నార్సింగికి వచ్చే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తోడు.. హైదరాబాద్‌ జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలటంతో మూసీలో వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం మధ్యాహ్నం వరకు మూసారాంబాగ్‌-అంబర్‌పేట చాందినీ బ్రిడ్జి వద్ద నీటిమట్టం బ్రిడ్జికి అడుగున్నర కిందికి ఉండగా, సాయంత్రం వరకు ప్రవాహం పెరిగి బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తుగా కాచిగూడ ట్రాఫిక్‌ పోలీసులు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. ట్రాఫిక్‌ను గోల్నాక న్యూ బ్రిడ్జివైపు మళ్లించారు.

Heavy rain : హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం

మరోవైపు రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులకు వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం నాటికి కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టికి 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 18 వేల అవుట్‌ ఫ్లో కొనసాగుతోంది. నారాయణపూర్‌కు 7,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జూరాలకు 24,500 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 26,160 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఎగువ నుంచి 36,914 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 35,666 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 37,695 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 62,095 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 60,417 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1000 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వరద వస్తుండటంతో వానకాలం పంటల సాగు కోసం సాగర్‌ ఎడమ కాల్వకు ఈ నెల 28న మంత్రి జగదీశ్‌రెడ్డి నీటి విడుదల చేయనున్నారు. కృష్ణ బేసిన్‌లోని దిగువన పులిచింతల ప్రాజెక్టుకు 13,678 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 10,066 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది.

Heavy Rain : తెలంగాణలో మళ్లీ జోరు వానలు..హైదరాబాద్ లో భారీ వర్షం

గోదావరి బేసిన్‌లో కూడా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని లక్ష్మీబరాజ్‌లో 85 గేట్లు ఎత్తి వరద నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టుకు 5,697 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 3,105 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 3,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 7,200 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు 1,32,134 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,25,940 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.