Telangana Covid Report News : తెలంగాణలో కొత్తగా 24 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14,127 కరోనా పరీక్షలు నిర్వహించగా..

Telangana Covid Report News : తెలంగాణలో కొత్తగా 24 కరోనా కేసులు

Telangana Covid Report

Updated On : April 16, 2022 / 10:25 PM IST

Telangana Covid Report News : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14,127 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 24 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 15 కేసులు వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో 2, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2, మంచిర్యాల జిల్లాలో 2, కరీంనగర్ జిల్లాలో 2, వరంగల్ రూరల్ జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో మరో 22 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,619 మంది కరోనా బారినపడగా వారిలో 7,87,286 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 222 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 12వేల 952 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 15మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Covid Report News)

Corona 4th wave: కొత్తగా కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన చిన్నారుల్లో సహసంబంధ వ్యాధులు

అటు దేశంలో కరోనా వ్యాప్తి ప్రస్తుతానికి అదుపులోనే ఉంది. మరో రోజు వెయ్యికి సమీపంలోనే కొత్త కేసులు వచ్చాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మరోసారి వైరస్ విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. హోం ఐసోలేషన్‌లో ఉండే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే పాజిటివిటీ రేటు నాలుగు శాతానికి సమీపించడం ఆందోళన కలిగిస్తోంది.

నిన్న 3 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 975 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందులో ఒక్క ఢిల్లీ నుంచి వచ్చిన కేసులే 366గా ఉన్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు 3.95 శాతానికి చేరింది. ఫిబ్రవరి 3 తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4.30 కోట్ల మందికి కరోనా సోకింది.

24 గంటల వ్యవధిలో మరో 796 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇటీవల రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,366 (0.03 శాతం)కు పెరిగాయి. మొత్తం కేసుల్లో రికవరీల వాటా 98.76 శాతంగా ఉంది. ఇక నిన్న మరో నలుగురు కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకూ 5.21లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.(Telangana Covid Report News)

దేశంలో దశలవారీగా కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. నిన్న సెలవురోజు కావడంతో నిర్ధారణ పరీక్షల సంఖ్య, టీకా పంపిణీ తక్కువగానే జరిగింది. నిన్న 6.89 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 186 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఢిల్లీ వాసులకు ఉచితంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

Coronavirus: ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా? చాపకింద నీరులా పెరుగుతున్న పాజిటివ్ కేసులు..

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. NCR ప‌రిధిలో కరోనా కేసుల తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ప్రధానంగా స్కూల్ టీచర్లు, విద్యార్థులు ఢిల్లీ, నోయిడాల్లో కరోనా బారినపడుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, వసంత్ కుంజ్ ప్రైవేట్ స్కూళ్లలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన మూడు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పాఠశాలల్లో 50 పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాలల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, కోవిడ్ నిబంధలను కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది.