Telangana Corona : తెలంగాణలో కరోనా మరణ మృదంగం.. 24గంటల్లో 53మరణాలు

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 30,2021) హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 5వేల 926 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

Telangana Corona : తెలంగాణలో కరోనా మరణ మృదంగం.. 24గంటల్లో 53మరణాలు

Telangana Corona

Updated On : April 30, 2021 / 9:55 AM IST

Telangana Corona : తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 30,2021) హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 5వేల 926 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,35,606కు పెరిగింది. ఇప్పటి వరకు 3,55,618 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 2,261 మంది కరోనాతో చనిపోయారు. నిన్న(ఏప్రిల్ 29,2021) ఒకే రోజు 77వేల 091 పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77వేల 727 యాక్టివ్‌ కేసులున్నాయి.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,441 కేసులున్నాయి. ఆ తర్వాత మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 631, రంగారెడ్డిలో 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్‌లో 330, నల్గొండలో 285, సిద్దిపేటలో 289, సూర్యాపేటలో 283, మహబూబ్‌నగర్‌లో 243, జగిత్యాలలో 230 కేసులు బయటపడ్డాయి.