Telangana state anthem : తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఇంకా నిర్ణయించలేదు : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఇంకా నిర్ణయించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. సమైక్య పాలకులు తెలంగాణపై వివక్ష చూపించారని విమర్శించారు.

Telangana state anthem : తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఇంకా నిర్ణయించలేదు : సీఎం కేసీఆర్

Telangana State Anthem Not Yet Decided

Updated On : March 17, 2021 / 4:22 PM IST

Telangana state anthem not yet decided : CM KCR : తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఇంకా నిర్ణయించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. సమైక్య పాలకులు తెలంగాణపై వివక్ష చూపించారని విమర్శించారు. తాము సంక్షేమానికి ఎక్కువత నిధులు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ కోటి ఎకరాల మాగాణిపై ఎవరేమన్నా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. 2014 వేసవిలో 12.23 లక్షల ఎకరాల్లో పంట సాగయ్యేదన్నారు. ప్రస్తుత వేసవిలో 58 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 39.36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2 వేలకు పెంచామన్నారు. భూసేకరణ రేట్లు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదని స్పష్టం చేశారు. 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మిస్తున్నామని చెప్పారు. మల్లన్నసాగర్ ను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ను అడ్డుకునేందుకు కోర్టుల్లో 300కు పైగా కేసులు వేశారని తెలిపారు.

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల సంఖ్య పెంచామని చెప్పారు. కరోనాపై కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో గణనీయంగా రేషన్ కార్డులు పెంచామన్నారు. పేదలను ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.