Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!

మంచిర్యాల మార్కెట్ లో సోమవారం టమాటా కిలో రూ.100లకు విక్రయించారు. మార్చిలో కిలో టమాటా ధర రూ.20 నుంచి రూ.30 ఉండగా ప్రస్తుతం భారీగా పెరిగింది.

Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!

Tomato Price

Updated On : May 24, 2022 / 8:33 AM IST

Tomato Price : ఒకవైపు వేసవి ఎండలు మరోవైపు మార్కెట్ లో నిత్యవసరాల ధరలు మండిపోతున్నాయి. ధరలు బాగా పెరగడంతో ఏదీ కొనాలన్నా జనం హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సింలిండర్ ధరలు భారీగా పెరిగాయి. చికెన్, మటన్ రేట్లు కూడా భారీగా పెంచారు. తాజాగా టమాటా ధర కూడా భారీగా పెరిగింది. పలు మార్కెట్లలో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కూరగాయల మార్కెట్లలో టమాటా సెంచరీ కొట్టింది.

మంచిర్యాల మార్కెట్ లో సోమవారం టమాటా కిలో రూ.100లకు విక్రయించారు. మార్చిలో కిలో టమాటా ధర రూ.20 నుంచి రూ.30 ఉండగా ప్రస్తుతం భారీగా పెరిగింది. 20 కిలోల టమాటా బాక్సు ధర గత నెల రూ.800 నుంచి రూ.1000 పలికింది. నిన్న 20 కిలోల టమాటా బాక్సు రూ.1600 ధర పలికింది.

Tomato Price Hike: అమ్మో టమాటా.. పెట్రోల్, చికెన్‌తోనే పోటీనా?!

ఎండల తీవ్రతకు రెండు, మూడు కిలోల వరకు పాడైపోతున్నాయని కూరగాయల వ్యాపారి వాపోతున్నారు. దీంతో కిలో టమాటా రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కూరగాయల ధరలు.. అందులోనూ టమాటా ధర భారీగా పెరగడంతో ప్రజలపై మరింత భారం పడుతోంది. పెరిగిన ధరలతో జనం సతమతమవుతున్నారు.