Viral Video: సిగ్నల్ జంప్ చేసిన ద్విచక్రవాహనదారుడు.. బస్సు దూసుకొచ్చి…

ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఎలా ప్రమాదానికి గురయ్యాడో తెలుపుతున్న ఓ వీడియోను వీసీ సజ్జనార్ పోస్ట్ చేశారు.

Viral Video: సిగ్నల్ జంప్ చేసిన ద్విచక్రవాహనదారుడు.. బస్సు దూసుకొచ్చి…

Accident

Updated On : July 23, 2023 / 5:18 PM IST

Viral Video – VC Sajjanar: సిగ్నల్ జంపింగ్ ప్రమాదకరమని, తొందరగా వెళ్లాలన్న ప్రయత్నంలో సిగ్నల్ జంప్ చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఎలా ప్రమాదానికి గురయ్యాడో తెలుపుతున్న ఓ వీడియోను వీసీ సజ్జనార్ పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో చెప్పలేదు. ఓ ఎక్స్ రోడ్ వద్ద రెడ్ సిగ్నల్ పడడంతో వాహనాలు ఆగుతాయి.

అయితే, ఓ వ్యక్తి సిగ్నల్ పట్టించుకోకుండా ద్విచక్ర వాహనాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇంతలో ఓ బస్సు వచ్చి ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొడుతుంది. సిగ్నల్ జంపింగ్ ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు వినిపించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోడ్డుపై వాహనాల్లో వెళ్తున్నప్పుడు ప్రమాదం ఎటునుంచి వస్తుందో చెప్పలేం. జాగ్రత్తలు పాటించకపోతే విలువైన జీవితాన్ని కోల్పోతాం.

Viral News : CV లో గృహిణిగా 13 సంవత్సరాల అనుభవం ఉందంటూ హైలైట్ చేసిన మహిళ.. అభినందిస్తున్న జనం