Hyd to Mumbai : సోనూ సూద్‌ను కలవడానికి చెప్పులు లేకుండా..700 కిలోమీటర్లు నడక

ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కలవడానికి ఓ వ్యక్తి 700 కిలోమీటర్లు నడిచాడు. అదీ కూడా..చెప్పులు లేకుండా..ద రియల్ హీరో.. నా గమ్యం..నా గెలుపు.. పాదయాత్ర హైదరాబాద్ టు ముంబై..అంటూ ప్ల కార్డు పట్టుకుని ఆ యువకుడు నడిచాడు.

Hyd to Mumbai : సోనూ సూద్‌ను కలవడానికి చెప్పులు లేకుండా..700 కిలోమీటర్లు నడక

Sonusood

Updated On : June 10, 2021 / 8:48 PM IST

Sonu Sood : ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కలవడానికి ఓ వ్యక్తి 700 కిలోమీటర్లు నడిచాడు. అదీ కూడా..చెప్పులు లేకుండా..ద రియల్ హీరో.. నా గమ్యం..నా గెలుపు.. పాదయాత్ర హైదరాబాద్ టు ముంబై..అంటూ ప్ల కార్డు పట్టుకుని ఆ యువకుడు నడిచాడు. ఇతనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఎట్టకేలకు అతను ముంబై చేరుకుని తన అభిమాన నటుడు సోనూసూద్‌ను కలిసి..తన ముచ్చటను తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా..సోనూసూద్ అతడితో కలిసి ఫొటో దిగారు. ఆ అభిమాని పేరు వెంకటేష్. వికారాబాద్ వాసి. అభిమానితో ఫోటో దిగి అతని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు సోనూసూద్. చెప్పులు లేకుండా 700 కిలోమీటర్లు నడిచి వచ్చిన తన అభిమానిని చూసి సోనూసూద్ చలించిపోయారు. దయచేసి ఎవ్వరూ ఇలాంటి పనులు చేయొద్దు అని రియల్ హీరో సూచించారు.

Read More : Drugs Smuggling : డ్రగ్స్ రవాణాలో కొత్త కోణం.. ఇండియా మీదుగా స్మగ్లింగ్..