Hyderabad : మహిళా పోలీసుకు హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు..ఇంతకీ ఆమె ఏం చేసిందంటే?

రోడ్డుపై వ్యర్థాలను చేత్తో తాకడానికి ఆలోచిస్తాం. కానీ ఓ మహిళా పోలీసు అధికారి అస్సలు ఆలోచించలేదు. డ్రైన్‌లో వ్యర్థ పదార్ధాలు అడ్డుపడి వర్షం నీరు నిలిచిపోవడంతో చేత్తో వాటిని తొలగించారు. ఆమె వ్యర్థాలు తొలగిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Hyderabad  : మహిళా పోలీసుకు హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు..ఇంతకీ ఆమె ఏం చేసిందంటే?

Hyderabad

Updated On : September 7, 2023 / 12:06 PM IST

Hyderabad : ఓ వైపు భారీ వర్షాలు.. డ్రైయిన్‌లో వ్యర్ధపదార్ధాలు అడ్డుపడటంతో నీరు నిలిచిపోయింది. తన పని కాదని చూస్తూ ఊరుకోలేదు ఓ మహిళా పోలీసు అధికారి. చేత్తో ఆ వ్యర్ధాలను తొలగించారు. వాటిని తొలగిస్తున్న వ్యక్తికి సాయం చేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. పోలీసు అధికారిని అందరూ ప్రశంసిస్తున్నారు.

Rajasthan : మహిళను 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. రక్షించడానికి పరుగులు తీసిన జనం.. వైరల్ వీడియో

శ్రీమతి D. ధనలక్ష్మి.. ACP Tr సౌత్ వెస్ట్ జోన్. హైదరాబాద్ టోలిచౌకి ఫ్లైఓవర్ దగ్గర డ్రైన్ వాటర్‌కి అడ్డుపడ్డ వ్యర్ధాలను తొలగిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలిచిపోవడంతో వాటిని తొలగిస్తున్న వ్యక్తికి సాయం చేస్తూ ఆమె కనిపించారు. ఆమె చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఆమె వ్యర్థాలను తొలగిస్తున్న వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.  ‘“శ్రీమతి. D. ధన లక్ష్మి, ACP Tr సౌత్ వెస్ట్ జోన్, టోలిచౌకి  ఫ్లైఓవర్ దగ్గర డ్రైన్ వాటర్ వద్ద వ్యర్థాలు అడ్డుపడటంతో వాటిని తొలగించి సాయం చేసారు’ అనే శీర్షికతో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Pakistan Zindabad : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు, పిచ్చకొట్టుడు కొట్టిన జనాలు.. సినిమా థియేటర్‌లో ఒక్కసారిగా కలకలం, వైరల్ వీడియో

పోలీసులకు గర్వకారణం అని.. ఆఫీసర్ యొక్క అద్భుతమైన పనికి హ్యాట్సాఫ్ అని.. చాలామంది కామెంట్లు చేశారు. ఎదురుగా ఏ చిన్న సమస్య కనిపించినా మనకెందుకులే అని వెళ్లిపోయేవారే కనిపిస్తారు.. కానీ తన బాధ్యత కాకపోయినా ఓ పోలీసు అధికారి చేసిన పని చాలామందిలో స్ఫూర్తి నింపుతోందని ప్రశంసించారు.

 

View this post on Instagram

 

A post shared by Addl. CP Traffic HYD City (@hyderabadtrafficpolice)