తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Yellow Alert: అవసరమైతేనే బయటకు రావాలని చెప్పింది. ఈ నెల 31న తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్..

తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

High Temperature in Telangana

Updated On : March 30, 2024 / 4:40 PM IST

తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.

రాష్ట్రంలో ఐదురోజుల పాటు వడగాలులు వీస్తాయని పేర్కొంది. అవసరమైతేనే బయటకు రావాలని చెప్పింది. ఈ నెల 31న తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి వేడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ఏప్రిల్ 1, 2, 3న ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.

Also Read: ఎయిర్‌పోర్ట్‌లో ఈ అమ్మాయి ఎలాంటి రీల్స్ తీసుకుందో చూడండి.. లక్షల్లో ఫైన్ వేయాలని డిమాండ్