Hyderabad : భర్తతో కలిసి ప్రియుడిని హత్య చేసిన భార్య

భర్తతో కలిసి ప్రియుడిని హత్యచేసింది ఓ మహిళ.. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు.

Hyderabad : భర్తతో కలిసి ప్రియుడిని హత్య చేసిన భార్య

Hyderabad

Updated On : August 17, 2021 / 12:01 PM IST

Hyderabad : వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేహా అనే మహిళ సోయల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం నడిపిస్తుంది. భర్త ఇంట్లో లేని సమయంలో సోయల్ ను ఇంటికి పిలిపించుకుంటుంది.

గత రాత్రి నేహా భర్త మొయినుద్దీన్ బయటకు వెళ్లడంతో సోయల్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. రాత్రి మొయినుద్దీన్ ఇంటికి వచ్చే చూసేసరికి ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు. వీరిని చూసిన మొయినుద్దీన్ ఇద్దరినీ నిలదీశాడు.. దీంతో నేహా ప్లేటు పిరాయించింది.

సోయల్ తనను వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో ఇద్దరు కలిసి సోయల్ ను హత్యచేశారు. అనంతరం నాచారం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతుంది.