Injection Fear : ఇంజెక్షన్ భయంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. రన్నింగ్ ఆటో నుంచి దూకేసిన యువకుడు

సూది మందు.. మత్తు ఇంజక్షన్.. ఆటో డ్రైవర్.. ఇలాంటి పదాలు వింటే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. వివాహేతర సంబంధంతో ఇంజెక్షన్ గుచ్చి ప్రియుడితో భర్తను మర్డర్ చేయించిన ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఎవరికి లిఫ్ట్ ఇచ్చే పరిస్థితిలో లేరు.

Injection Fear : ఇంజెక్షన్ భయంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. రన్నింగ్ ఆటో నుంచి దూకేసిన యువకుడు

Updated On : September 23, 2022 / 9:56 PM IST

Injection Fear : సూది మందు.. మత్తు ఇంజక్షన్.. ఆటో డ్రైవర్.. ఇలాంటి పదాలు వింటే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. వివాహేతర సంబంధంతో ఇంజెక్షన్ గుచ్చి ప్రియుడితో భర్తను మర్డర్ చేయించిన ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఎవరికి లిఫ్ట్ ఇచ్చే పరిస్థితిలో లేరు. రెండు రాష్ట్రాల్లోనూ ఇదే చర్చ జరుగుతున్న సమయంలో ఓ యువకుడు ఇంజెక్షన్ భయంతో ఆటో నుంచి దూకేసిన ఘటన వెలుగుచూసింది. ఖమ్మం జిల్లాలో గోపీ అనే యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

నేలకొండపల్లి మండలం అజయ్ తండాకు చెందిన బానోత్ గోపీ.. నేలకొండపల్లిలో ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీకి వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కాడు. ఆటోలో ఓ వ్యక్తి, వృద్ధుడు, బాలుడు ఉన్నారు. బాలుడు వెనుక సీటులో పడుకుని ఉన్నాడు. డ్రైవర్ కి ఆటోలో ఉన్న వ్యక్తికి మధ్య సూది ఘటన గురించి చర్చ జరిగింది. దీంతో గోపీ భయపడిపోయాడు. వెంటనే ఆటో ఆపాలని కోరాడు. అయితే ఆటో ఆపలేదు. అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో గోపీలో మరింత భయం పెరిగింది. వెనుకున్న బాలుడిని సూది వేసి పడుకోబెట్టి ఉండొచ్చని, తనకు కూడా అదే చేస్తారేమోనని అనుమానించాడు. అదే సమయంలో వృద్ధుడు సంచిలో చేయి పెట్టాడు. వారు కచ్చితంగా తనకు సూది మందు వేస్తారని భయపడిన గోపీ.. రన్నింగ్ ఆటో నుంచి బయటకు దూకేశాడు గోపీ. ఈ ఘటనలో గోపీకి తీవ్ర గాయాలయ్యాయి.