Margani Bharat: అందుకే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు: ఎంపీ భరత్
అర్ధరాత్రి సమయంలో చేసే యాత్రను ఏమంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో..

Margani Bharat Ram
Margani Bharat: టీడీపీ (TDP) నేత నారా లోకేశ్(Nara Lokesh)పై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల గ్రామంలో దాదాపు రూ.2 కోట్లతో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఎంపీ భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బరువు తగ్గడానికే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. అర్ధరాత్రి సమయంలో చేసే యాత్రను ఏమంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి అయిన నారా లోకేశ్ ఆ సమయంలో ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు.
టీడీపీ అమలు చేయలేని పథకాలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా అందిస్తారా? అని అన్నారు. టీడీపీ మేనిఫెస్టో పేరిట మభ్యపెడుతోందని అన్నారు. పెన్షన్‌లకు, ఇన్సూరెన్స్ పథకానికి తేడా తెలియని లోకేశ్‌కు ముఖ్యమంత్రి జగన్ ని విమర్శించే స్థాయి లేదని చెప్పారు.