ఇక నో టెన్షన్ : మార్కెట్లోకి వచ్చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’

Russian Vaccine sputnik v: ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ రష్యా మార్కెట్లోకి విడుదలైంది. కరోనా మహమ్మారి నివారణ కోసం తాము అభివృద్ధి చేసిన ‘sputnik v’ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి గమాలియా నేషనల్ రిసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్.. అన్ని రకాల ప్రయోగ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించింది. అందువల్ల దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం అని రష్యా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
‘sputnik v’ వ్యాక్సిన్ తొలి బ్యాచ్ ను విడుదల చేసిన పుతిన్ ప్రభుత్వం, దాన్ని ప్రజలకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. పౌర అవసరాల నిమిత్తం వ్యాక్సిన్ ను విడుదల చేశామని, రీజియన్ల వారీగా వీటిని పంపిణీ చేసే ప్రక్రియ సాఫీగా సాగేలా చూస్తున్నామని, దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
https://10tv.in/novavax-coronavirus-vaccine-is-safe-published-results-show/
ప్రపంచంలోనే కరోనాకు తొలి వ్యాక్సిన్ ను తయారు చేసింది తామేనని గత నెల 11న ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన కూతురు కూడా sputnik v తీసుకున్నట్లు ఆ సమయంలో అయన తెలిపారు. వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఇప్పుడు రష్యా కొవిడ్ వ్యాక్సిన్‌ను రష్యా మార్కెట్లోకి విడుదలైంది.
ఇక ఈ Russian Vaccine పై ప్రపంచవ్యాప్తంగా పలువురు సైంటిస్టులు అనుమానాలను వ్యక్తం చేసినా, రష్యా మాత్రం ఎవరి విమర్శలనూ పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది.
మరోవైపు, ఇప్పటివరకు దాదాపు బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్ చేశాయని ఈ Russian Vaccineకు నిధులు సమకూరుస్తున్న రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం తొలి బ్యాచ్ వ్యాక్సిన్‌ను ప్రజల్లోకి విడుదల చేసిన రష్యా.. త్వరలోనే మరికొన్ని డోస్‌లను అందుబాటులోకి తేవడానికి యత్నిస్తుంది.