ఏపీలో మరో 21మందికి పాజిటివ్: 132కి చేరిన కరోనా కేసులు

ఏపీలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 7 గంటల తర్వాత 24 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించగా.. ఇవాళ(02 ఏప్రిల్ 2020) మరో 21కేసులు నమోదు అయినట్లు బులెటిన్ విడుదల చేసింది ఆరోగ్యశాఖ. లేటెస్ట్‌గా పాజిటివ్ అని తేలిన కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 132కి చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో 90 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మొత్తం ఇవాళ నమోదైన కేసులతో తెలంగాణ కంటే ఏపీలోనే కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.
ఇంకా 493మంది రిపోర్టులు కోసం వేచి చూస్తున్నారు.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు: