70వ వన మహోత్సవం : APSRTCలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : August 31, 2019 / 06:41 AM IST
70వ వన మహోత్సవం : APSRTCలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు – సీఎం జగన్

Updated On : August 31, 2019 / 6:41 AM IST

పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని…అందులో భాగంగా  APSRTCలో వేయి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం గుంటూరు జల్లాలో జరిగిన 70వ వన మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీఎస్ ఆర్టీసీ దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు.

గ్రీన్ ట్యాక్స్ తీసుకొస్తామని..పరిశ్రమల్లో కాలుష్యం తొలగించే పని ప్రభుత్వం చేస్తుందని..పొల్యూషన్ కంట్రోల్ బోర్డను ప్రక్షాళన చేస్తామన్నారు. ఏపీ రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమలు వస్తే..ముందుగా దానికి సంబంధించిన ఫైల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పంపించాలి..పర్యావరణానికి ఎలాంటి హానీ లేదని బోర్డు చెప్పిన తర్వాత ఇతర పనులు జరగాలని సూచించారు. ఫార్మా రంగంలో ఏకంగా లక్ష టన్నుల కాలుష్యం వస్తుందని అధికారులు తనకు చెప్పారని..కేవలం 30 వేల టన్నులపై ఆడిట్ జరుగుతోందని..మిగతా టన్నుల కాలుష్యం సముద్రంలో కలుస్తోందని సభలో వెల్లడించారు. 

ప్రస్తుతం 25 కోట్ల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నట్లు…ఇప్పటి వరకు 4 కోట్ల మొక్కలు నాటినట్లు..శనివారం ఒక్కరోజే కోటి మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఒక మొక్క నాటడం కాదు..కనీసం మూడు, నాలుగు మొక్కలు నాటే పరిస్థితికి రావాలన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు..ప్రతి పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ రక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారుర సీఎం జగన్.