జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం: మారిన మంత్రుల శాఖలు

  • Published By: vamsi ,Published On : January 30, 2020 / 06:34 PM IST
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం: మారిన మంత్రుల శాఖలు

Updated On : January 30, 2020 / 6:34 PM IST

మండలి రద్దు విషయంలో కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే రాజీనామా చేయడానికి సిద్దమేనని మోపిదేవి ఇప్పటికే వెల్లడించారు. టీడీపీ వాళ్లు చెబితే రాజీనామాలు చేస్తామా అంటూ ఇప్పటికే ప్రశ్నించిన మోపీదేవి, టీడీపీ తరహాలో తాము పదవుల కోసం అర్రులు చాచే రకం కాదని అన్నారు. ఈ క్రమంలోనే మంత్రుల శాఖల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా.. మంత్రి మోపిదేవి వద్దనున్న మార్కెటింగ్‌శాఖను, అలాగే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వద్దనున్న ఫుడ్‌ ప్రాససింగ్‌ శాఖను.. వ్యవసాయ, సహకార శాఖలను చూస్తున్న మంత్రి కె.కన్నబాబుకు అప్పగించింది. పరిపాలనా పరమైన సౌలభ్యంతో పాటు మరింత మేలు జరిగే ఉద్దేశంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

మంత్రి మోపిదేవి వద్ద ప్రస్తుతం పశుసంవర్థక, మత్స్యశాఖలు ఉన్నాయి. మరో శాఖను మోపిదేవికి అప్పగించాలని సీఎం యోచిస్తున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అలాగే బదలాయించిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పోనూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వద్ద పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖలున్నాయి. కొద్దిరోజుల కిందటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్‌డెవలప్‌మెంట్‌ శాఖను మంత్రి గౌతంరెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే.