పందిని ఢీకొన్న కారు.. ఎఎస్సై మృతి
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పందిని ఢీకొని కారు బోల్తా పడడంతో ఓ ఎఎస్సై మృతి చెందాడు.

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పందిని ఢీకొని కారు బోల్తా పడడంతో ఓ ఎఎస్సై మృతి చెందాడు.
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పందిని ఢీకొని కారు బోల్తా పడడంతో ఓ ఎఎస్సై మృతి చెందాడు. ఈ సంఘటన ఆత్మకూరు మండలంలోని వాసలి దగ్గర ముంబై నేషనల్ హైవేపై చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. రాజు (45) అనే వ్యక్తి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఎఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజులాగే విధులకు వెళ్లాడు. ఈక్రమంలో శుక్రవారం (ఆగస్టు 30, 2019)వ తేదీ ఉదయం విధులు ముగించుకొని కారులో ముంబై రోడ్ పై నెల్లూరు వైపు వెళ్తున్నారు. మార్గంమధ్యలో వాసలి దగ్గరకు రాగానే సడెన్ గా పంది రోడ్డుపైకి వచ్చింది.
పందిని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పింది. పందిని ఢీకొన్న కారు పక్కనే ఉన్న పంట పొలాల్లో బోల్తా పడింది. దీంతో రాజుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డి తెలిపారు.
Also Read : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరి