చెరువులోకి దూసుకెళ్లిన కారు : ఇద్దరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 08:44 AM IST
చెరువులోకి దూసుకెళ్లిన కారు : ఇద్దరు మృతి

Updated On : September 8, 2019 / 8:44 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. శనివారం (సెప్టెంబర్ 7, 2019) రాత్రి ఆళ్లపల్లి గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు మద్దెల చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. 

ఆదివారం (సెప్టెంబర్ 8, 2019) ఉదయం చెరువులో కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో నుంచి కారును బయటికి తీసి, అందులోని మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. మృతులు సీతారామపురం, మైలారంకు చెందిన రాజబాబు, రవిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.