కోడెల మృతిపై సీఎం జగన్ దిగ్ర్భాంతి..కుటుంబ సభ్యులకు సానుభూతి

  • Published By: veegamteam ,Published On : September 16, 2019 / 09:18 AM IST
కోడెల మృతిపై సీఎం జగన్ దిగ్ర్భాంతి..కుటుంబ సభ్యులకు సానుభూతి

Updated On : September 16, 2019 / 9:18 AM IST

టీడీపీ సీనియర్‌ నేత..ఏపీ  మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కోడెలది సుదీర్ఘ రాజకీయ జీవితమన్నసీఎం జగన్ కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

 

కోడెల మరణం పట్ల గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కోడెల మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి  కోడెల కుటుంబ సభ్యులకు  సానుభూతిని తెలిపారు. 

మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు. కోడెల శివప్రసాదరావు మృతి విచారకరమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోడెల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతి అని ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు.