భయపెడుతున్న బుల్ బుల్ : ఆంధ్రపై తుఫాన్ ప్రభావం

  • Published By: vamsi ,Published On : November 8, 2019 / 03:11 AM IST
భయపెడుతున్న బుల్ బుల్ : ఆంధ్రపై తుఫాన్ ప్రభావం

Updated On : November 8, 2019 / 3:11 AM IST

మహా తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తుంటే మరోవైపు బుల్ బుల్ తుఫాన్ భయపెడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ ప్రభావం ఇప్పుడు ఉత్తరాంధ్రపైన కూడా కనిపిస్తుంది. బుల్ బుల్ తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణశాఖ.

ప్రస్తుతం ఉన్న కదలికలను బట్టి చూస్తే.. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుందని అంచనా వేశారు విశాఖలోని వాతావరణశాఖ అధికారులు. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌కు ఈశాన్య దిశగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉందని వెల్లడించారు. క్రమంగా ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

శనివారం(09 నవంబర్ 2019) సాయంత్రం లేదా రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య బుల్ బుల్ తుఫాన్.. తీరాన్ని దాటవచ్చునని చెబుతున్నారు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, ఉత్తర ఒడిశా, దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఉంటుందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు అధికారులు.

ఇక ఇప్పుడు వస్తున్న బుల్ బుల్ తుఫాన్ దేశంలో ఈ ఏడాది వస్తున్న ఏడవ తుఫాన్.