కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి

కర్నూలు జిల్లా అవుకు మండలంలో 40 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. దాదాపు రెండు లక్షల నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 04:20 AM IST
కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి

Updated On : December 27, 2019 / 4:20 AM IST

కర్నూలు జిల్లా అవుకు మండలంలో 40 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. దాదాపు రెండు లక్షల నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు.

కర్నూలు జిల్లా అవుకు మండలంలో 40 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. అవుకు మండలంలోని కొండమ్మానాయునిపల్లెకు చెందిన ఈరన్నకు గొర్రెల మంద ఉంది. అయితే ఊర కుక్కలు గొర్రెల దొడ్డిలోకి ప్రవేశించి వాటిపై దాడి చేశాయి. 

దాదాపు 40 గొర్రె పిల్లలను కొరికి చంపాయి. దీంతో గొర్రెల యజమాని ఈరన్న లబోదిబో మంటున్నాడు. దాదాపు రెండు లక్షల నష్టం వాటిల్లినట్టు చెబుతున్నాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.