జనసేన ప్రభుత్వమే: 88 సీట్లు గెలుస్తాం

  • Published By: vamsi ,Published On : April 18, 2019 / 07:09 AM IST
జనసేన ప్రభుత్వమే: 88 సీట్లు గెలుస్తాం

Updated On : April 18, 2019 / 7:09 AM IST

రాబోయే ప్రభుత్వం జనసేనదే అని, తమ పార్టీ 88 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. జనసేన తరుపున విశాఖపట్నం అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీ నారాయణ ఏపీలో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ, సీపీఐ, సీపీఎం మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు లక్ష్మీ నారాయణ చెప్పారు.
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్

విజయనగరం జిల్లా ఎస్‌.కోటకు వచ్చిన ఆయన స్థానికులతో మరియు విలేకరులతో మాట్లాడిన లక్ష్మీ నారాయణ.. తామెవరికీ మద్దతు ఇవ్వమని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎవరి మద్దతు అవసరం లేదని లక్ష్మీ నారాయణ అన్నారు. అలాగే తన సర్వీసును విడిచిపెట్టి మంచిపని చేశానని, ప్రజల మధ్య సంతోషంగా గడుపుతున్నానని లక్ష్మీనారాయణ చెప్పారు. ఏ లెక్కలతో ఆయన చెప్పారో తెలీదు కానీ జనసేన ఏపీలో అధికారంలోకి వస్తుందని మాత్రం ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం.