అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన

అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు 31, 31 తేదీల్లో ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులను ఆయన పరిశీలించనున్నారు. రాజధాని అమరావతి తరలింపుపై విభిన్న వార్తలు వస్తున్న కారణంగా.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు శనివారం పవన్ కళ్యాణ్ ను కలిశారు.
రాజధాని సమస్యలపై పోరాటానిక మద్దతివ్వాలని రైతులు పవన్ ను కోరారు. రాజధాని అమరావతి లోనే ఉండాలని.. అక్కడి నుంచి తరలించకూడదని ఆయన అన్నారు. రాజధాని రైతుల ఆవేదన అర్ధం చేసుకున్నానని…వారికి అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.
అమరావతి లో పర్యటించి రైతులతో సమావేశమై వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఈప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని పవన్ జగన్ ను కోరారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని…రాష్ట్రం మొత్తానిదని పవన్ అన్నారు.
రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలి pic.twitter.com/Mg2GGfwEMs
— JanaSena Party (@JanaSenaParty) August 24, 2019