అనంతపురంలో ప్రైవేట్ ట్రావెల్‌ బస్సు బోల్తా

  • Published By: veegamteam ,Published On : October 10, 2019 / 01:37 AM IST
అనంతపురంలో ప్రైవేట్ ట్రావెల్‌ బస్సు బోల్తా

Updated On : October 10, 2019 / 1:37 AM IST

అనంతపురం జిల్లాలో గురువారం (అక్టోబర్ 10, 2019) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పామురాయి సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా రహదారిపై బోల్తాపడింది.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారిలో 11 మంది గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తొలగించారు.

ఇక బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను వెంటనే అక్కడి స్థానికుల సహాయంతో పోలీసులు బయటికి తీసి వారిని రక్షించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ నిద్రపోతూ.. డ్రైవింగ్ చేశాడని బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు.