RCBvsRR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్‌ 2019లో భాగంగా జరుగుతోన్న 14వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి.

RCBvsRR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Updated On : April 2, 2019 / 2:00 PM IST

ఐపీఎల్‌ 2019లో భాగంగా జరుగుతోన్న 14వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి.

ఐపీఎల్‌ 2019లో భాగంగా జరుగుతోన్న 14వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఏప్రిల్ 2 మంగళవారం సొంతగడ్డపై ఆడుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయం నమోదు చేయాలని ఎదురుచూస్తోంది. మరోవైపు కోహ్లీ సేనకు ఆడిన 3 మ్యాచ్‌లలోనూ పరాజయమే కానీ సత్ఫలితాలు రాలేదు. దీంతో ఇరు జట్లకు ఈ హోరాహోరీ పోరులో విజయం దక్కించుకోవడం కీలకం. 
Read Also : IPL 2019: రికార్డుకు 63 పరుగుల దూరంలో కోహ్లీ

లీగ్ పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో నిలిచిన రాజస్థాన్, బెంగళూరుల ఫలితం మారడానికి మిగిలి ఉంది ఈ ఒక్క మ్యాచే. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌పై ఇరు జట్ల కెప్టెన్‌లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

రాజస్థాన్ కెప్టెన్ అజింకా రహానె మాట్లాడుతూ.. ‘ఆఖరి 3 మ్యాచ్‌లలో మా ప్రదర్శన బాగానే ఉంది. చిన్న పొరబాట్లను సరిచేసుకుంటే బాగా రాణించగలమన్న నమ్మకముంది’ అని తెలిపాడు. 

బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘రాయల్స్‌తో తలపడేందుకు ఈ మైదానం చాలా అనుకూలంగా కనిపిస్తోంది. ముంబైపై ఆడిన విధంగానే ఈ మ్యాచ్ లోనూ ఆడాలనుకుంటున్నాం. మాదైన ఆటతీరుతో దూసుకుపోవాలనుకుంటున్నాం. ఈ గేమ్ కచ్చితంగా మాదే.’ అని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. 
Read Also : వచ్చాడు.. వెళుతున్నాడు: మలింగకు ఐపీఎల్ నుంచి బ్రేక్