KCRకు గుడి కట్టిస్తా – జగ్గారెడ్డి

జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి.. హాట్‌హాట్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే కాంగ్రెస్ లీడర్. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్న నాయకుడు. ఇంతటి స్పీడున్న ఈ లీడర్.. ఇటీవల కాస్త వెనక్కి తగ్గారనిపిస్తోంది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్‌ను తీవ్ర విమర్శలు చేసిన ఈ లీడర్ ఇప్పుడు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కేసీఆర్ పాలనపై ప్రశంసలతో ముంచెత్తారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ఆయన స్వాగతిస్తున్నారు. దీనితో ఆయన TRSలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. తాజాగా ఏప్రిల్ 18వ తేదీ గురువారం జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. పంటలకు గిట్టుబాటు ధర విధానం అమలును స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఒక మంచి ఆలోచన అంటూ తెలిపిన జగ్గారెడ్డి..ఈ నిర్ణయం మాత్రం అమలు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గిట్టుబాటు ధర విధానం అమలు అయితే..రైతుల పక్షాన KCRకి గుడి కట్టిస్తానంటూ ప్రకటించారు. ఈ నిర్ణయం మాత్రం రెవెన్యూ శాఖ ఉద్యోగులతో చర్చించాలని సూచించారు. అవినీతి నిర్మూలన మాత్రం దేవుడి వల్ల కూడా కాదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో TRS హవా కొనసాగినా.. సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు జగ్గారెడ్డి. అయితే..ఎన్నికల తర్వాత జగ్గారెడ్డి స్వరం మారిపోయింది. గులాబీ బాస్‌పై ఎప్పుడూ గుస్సా చూపించే ఆయన.. ప్రస్తుతం కేసీఆర్ ఫ్యామిలీపై ప్రేమ కురిపిస్తున్నారు.