విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుశ్రత్.ఎం.మండ్రూప్‌కర్ బుధవారం (అక్టోబర్ 9, 2019) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాక, పోకలు చేస్తాయి. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పీఆర్వో తెలిపారు.
ప్రత్యేక రైళ్లు.. వాటి నంబర్లు:
> ట్రైన్ నెంబరు (07053) సికింద్రాబాద్ – కాకినాడ ప్రత్యేక రైలు అక్టోబర్ 11వ తేదీ రాత్రి 9.40కు సికింద్రాబాద్‌లో బయలుదేరి తరువాతి రోజు ఉదయం 7.40కు కాకినాడ చేరుతుంది.
> ట్రైన్ నెంబరు (07054) కాకినాడ – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు అక్టోబర్ 13వ తేదీ రాత్రి 8 గంటలకు కాకినాడలో బయలుదేరి తరువాతి రోజు ఉదయం 7.40కు సికింద్రాబాద్ చేరుతుంది.
> ట్రైన్ నెంబరు (07255) నరసాపూర్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు అక్టోబర్ 10,12వ తేదీలలో రాత్రి 6 గంటలకు నరసాపూర్‌లో బయలుదేరి తరువాతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
> ట్రైన్ నెంబరు (07256) సికింద్రాబాద్ - నరసాపూర్ ప్రత్యేక రైలు అక్టోబర్ 11వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి తరువాతి రోజు ఉదయం 6.05కు నరసాపూర్ చేరుతుంది.
> ట్రైన్ నెంబరు(07255) నరసాపూర్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు అక్టోబర్ 13వ తేదీ రాత్రి 8.50కు నరసాపూర్‌లో బయలుదేరి తరువాతి రోజు ఉదయం 5.50కు సికింద్రాబాద్ చేరుతుంది.