బోటు ప్రమాదంలో బయటపడ్డ వాళ్ల వివరాలు ఇవే

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో పలువురు గల్లంతయ్యారు. తిరుపతికి చెందిన మధులత తన భర్తతో కలిసి పాపికొండల విహారానికి వెళ్లారు. బోటు ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడగా, ఆమె భర్త కనిపించట్లేదు. భర్త ఆచూకీ కోసం మధులత కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది. మరోవైపు విహార యాత్రకు వెళ్లిన వారి కుటుంబసభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు.
అలాగే విశాఖ నుంచి 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ బోటులో ఎక్కారు. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి , మంగమ్మ ఆసుపత్రి ప్రాంతానికి సంబంధించిన వారు కాగా వారి ఫోన్లు పని చేయట్లేదని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే ఇంకా ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. తమ కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కొందరి వివరాలను మాత్రం అధికారులు ప్రకటించారు.
ప్రమాదం నుంచి బయటపడినవారు:
బసికె. వెంకటస్వామి (వరంగల్)
ఆరేపల్లి. యాదగిరి (వరంగల్)
గొర్రె. ప్రభాకర్ (వరంగల్)
దర్శనాల సురేష్ (వరంగల్)
బసికె దశరథం (వరంగల్)
ఎండీ మజ్హార్ (హైదరాబాద్)
సీహెచ్. రామారావు (హైదరాబాద్)
కె.అర్జున్ (హైదరాబాద్)
జానకి రామారావు (హైదరాబాద్)
సురేష్ (హైదరాబాద్)
కిరణ్ కుమార్ (హైదరాబాద్)
శివశంకర్ (హైదరాబాద్)
రాజేష్ (హైదరాబాద్)
గాంధీ (విజయనగరం)
మధులత (తిరుపతి)
బుసల లక్ష్మి (విశాఖ గోపాలపురం)
వరంగల్ నుంచి వెళ్లినవారిలో ఆచూకీ తెలియని వారి వివరాలు:
సివి. వెంకటస్వామి
బసికె. రాజేంద్రప్రసాద్
కొండూరు. రాజకుమార్
బసికె. ధర్మరాజు
గడ్డమీది. సునీల్
కొమ్ముల. రవి
బసికె. రాజేందర్
బసికె. అవినాష్
గొర్రె. రాజేంద్రప్రసాద్