పని ఇప్పిస్తానని నమ్మించి 6నెలల బాలుడు కిడ్నాప్

తిరుపతి సమీపంలోని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆరు నెలల పసిబాబు కిడ్నాప్ కు గురయ్యాడు. ఓ మహిళ స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో అదను చూసిన ఓ మహిళ ఆమె దగ్గర నుంచి పసిబాబును లాక్కుని తీసుకెళ్లిపోయింది. దీంతో కంగారు పడిన తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి వరకూ తనతో మాట్లాడిన సదరు మహిళ ఆమె తమిళంలో మాట్లాడిందని పసిబిడ్డ తల్లి తెలిపింది. దీంతో పోలీసులు స్టేషన్ లో ఉన్న సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు. (స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయి : సీఎం జగన్ వార్నింగ్ )
వివరాల్లోకి వెళితే..తాడిపత్రికి చెందిన స్వర్ణలత భర్తతో గొడవలు ఉన్న కారణంతో కొంతకాలంగా పుట్టింట్లో ఉంటోంది. అక్కడకు కూడా వచ్చిన తాగుబోతు భర్త నానా గొడవలు చేస్తుంటూ అతనితో వేగలేక..తాను అక్కడే ఉంటే తరచూ వచ్చి గొడవ చేస్తాడనే ఉద్ధేశంతో పుట్టింటి నుంచి కూడా బయటకు వచ్చేసింది స్వర్ణలత. కానీ ఏం చంటిబిడ్డతో ఏం చేయాలతో తెలీలేదు. పనికోసం వెతుక్కుంటోంది.
సరిగ్గా ఇదే సమయానికి రేణిగుంట రైల్వే స్టేషన్‌లో పనిచేసే స్వీపర్ ద్వారా స్వర్ణలతకు అనిత అనే మహిళతో పరిచయమైంది. తాను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నానని.. స్వర్ణలతకు పని ఇప్పిస్తానని అనిత స్వర్ణలతను నమ్మించింది. పనికోసం వెతుక్కుంటున్న స్వర్ణలత అనిత మాటల్ని నమ్మింది. అలా స్వర్ణలత నాలుగు రోజుల పాటు రైల్వే స్టేషన్‌లోనే గడిపింది. ఈ క్రమంలో అనితను స్వర్ణలత బాగా చూసుకోవటంతో బాగా నమ్మింది. నాలుగు రోజుల నుంచి అదే బట్టలతో ఉంటున్నావు..మీ ఇద్దరికీ కొత్త బట్టలు కొనిస్తానని తీసుకెళ్లింది అనిత.. అక్కడ ఆమెను బురిడీ కొట్టించి బాబుని తీసుకుని వెళ్లిపోయింది.
దీంతో మోసపోయానని గ్రహించిన స్వర్ణలత బిడ్డ కోసం అల్లాడిపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఇద్దరు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.