గుంటూరులో ఉద్రిక్తత : టీడీపీ-వైసీపీ వర్గీయుల ఘర్షణ

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధిశిరిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పలుమార్లు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడులు

  • Published By: veegamteam ,Published On : September 10, 2019 / 05:20 AM IST
గుంటూరులో ఉద్రిక్తత : టీడీపీ-వైసీపీ వర్గీయుల ఘర్షణ

Updated On : September 10, 2019 / 5:20 AM IST

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధిశిరిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పలుమార్లు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడులు

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధిశిరిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పలుమార్లు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. తమ వర్గీయుల ఇళ్లపై వైసీపీ వర్గీయుల దాడులు చేశారని టీడీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. ఈ దాడుల్లో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిని సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు చెందిన ట్రాక్టర్, బైక్ లను దుండగులు ధ్వంసం చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రెండు వర్గాలకు చెందిన వారిని గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. అధికార, విపక్ష పార్టీల వర్గాల మధ్య ఘర్షణలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు.